Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30 నుంచి ప్రారంభమయ్యే ఆషాడ బోనాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు:
- మంత్రి తలసాని శ్రీనివాస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బోనాల పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అనీ, ఈ నెల 30 నుంచి ప్రారంభమయ్యే ఆషాడ బోనాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నదని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించా రు. మంగళవారం హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో ఎమ్మెల్యే కౌసర్ మొహినోద్దీన్, వివిధ శాఖల అధికారులతో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన పండుగలు బోనాలు, బతు కమ్మ ఉత్సవాలు నేడు విశ్వవ్యాప్త మయ్యాయనీ, ఇది మన కెంతో గర్వకారణమని తెలిపారు. ఈ నెల 30న గోల్కొండ, జులై17 న సికింద్రాబాద్, 24న హైదరాబాద్ బోనాలు జరుగుతాయని చెప్పారు. గోల్కొండలోని జగదాంబ మహంకాళి అమ్మవారితో పాటు 26 దేవాలయాలకు ప్రభు త్వం తరపున పట్టువస్త్రాలను సమర్పిస్తామని తెలిపారు. బోనాల సందర్భంగా గుడుల వద్ద తోపులాటలు జరుగ కుండా బారీకేడ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. శాంతిభద్ర తల నిమిత్తం గోల్కొండ వద్ద సీసీ కెమెరాలను పెడతున్నా మనీ, 800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తా మని తెలిపారు. వాహనాల పార్కింగ్ కోసం 8 ప్రాంతాల ను గుర్తించామనీ, 14 ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లిస్తామని చెప్పారు. సందర్శకుల దాహార్తి తీర్చేందుకు వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో 8.75 లక్షల వాటర్ ప్యాకేట్స్, 55 వేల వాటర్ బాటిల్స్‌ను అందుబాటులో ఉంచుతామని వివరించారు. నాలుగు అంబులెన్స్‌లు అందుబాటులో ఉంటాయని, ఐదు మెడికల్ క్యాంప్‌లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సీవరేజ్ లీకేజీలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రోడ్ల మరమ్మతులుంటే గుర్తించి యుద్ధప్రాతి పదికన పూర్తి చేయాలని సూచించారు. ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీసీపీ జోయల్ డేవిస్, ఏసీపీ శివ మారుతి, ట్రాఫిక్ డీసీపీ కరుణాకర్, ట్రాన్స్‌కో సీజీఎం నరసింహ స్వామి, వాటర్ వర్క్స్ ఈఎన్సీ కృష్ణ, దేవాదాయ శాఖ డీసీ రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ, ఈఓ శ్రీనివాస రాజు, జీహెచ్ఎమ్సీ జోనల్ కమిషనర్ రవికిరణ్, పురా వస్తు శాఖ అధికారి రోహిణి, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వ ర్లు, ఆర్అండ్ఏమ్పీ బీఎస్ఈ హఫీజ్, వాటర్ వర్క్స్ జీఎం నాగేందర్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్, ఆర్టీసీ ఆర్ఎమ్ ప్రసాద్, అగ్నిమాపక శాఖ ఆర్ఎమ్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.