Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
క్రీడలు, క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. బుధవారం హైదరాబాద్ శివారులోని గండి మైసమ్మలోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో ముగిసిన రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల విజేతలకు ఆయన ట్రోఫీ, నగదు బహుమతులను అందచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో క్రీడాకారులకు వివిధ క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా స్టేడియాలు, క్రీడా ప్రాంగణాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నదని అన్నారు. రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల విజేతగా నిలిచిన ఉమ్మడి మెదక్ జిల్లా జట్టుకు లక్షన్నర రూపాయల నగదు బహుమతితోపాటు ట్రోఫీని, రన్నర్‌గా నిలిచిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జట్టుకు రూ. 75 వేల నగదుతో పాటు ట్రోఫీని అందజేశారు. కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు వీ ఆగంరావు, కార్యదర్శి మురళీధర్ రావు, మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల కార్యదర్శి మర్రి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.