Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఎంఈ/ఎంటెక్/ఎంఆర్క్/ఎంఫార్మసీ/ఫార్మాడీ కోర్సుల్లో 2022-23 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు పీజీఈసెట్ కన్వీనర్ పి లక్ష్మినారాయణ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆలస్య రుసుం లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు గడువును ఈనెల 30 వరకు పొడిగించామని వివరించారు.