Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సాగిన విధ్వసం కాండకు కారకుడైన మరో మూల సూత్రధారితో పాటు 13 మంది నిందితులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. దీనిలో రెండో నిందితుడిగా పేర్కొనబడ్డ పృథ్వీరాజ్ సోనాను ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పృథ్వీరాజ్ ఘటన జరిగిన సమయంలో రైల్వే ఇంజిన్లను తగలబెట్టటంలో కీలక పాత్ర వహించినట్టు దర్యాప్తులో తేలింది. రైలు డ్రైవింగ్ క్యాబిన్లో లోకోపైలట్ సీట్‌ను తగలబెట్టటంతో పాటు రైలును నియంత్రించే ఆధునిక పరికరాల విధ్వంసానికి పాల్పడిన పృథ్వీరాజ్.. తాను చేసిన ప్రతీ చర్యనూ వీడియోలో చిత్రీకరించటమేగాక వాటిని వాట్సప్ గ్రూపులలో షేర్ చేశాడని తేలింది. సాయి డిఫెన్స్ అకాడెమిలో శిక్షణ పొందిన పృథ్వీరాజ్.. సుబ్బారావు ద్వారానే ధ్వంస రచనకు ప్రేరణ పొందినట్టు దర్యాప్తు అధికారులు చెప్పారు. మొత్తమ్మీద ఈకేసులో అతికీలకమైన ఈ 13 మందిని అరెస్టు చేసిన సికింద్రాబాద్ రైల్వే అధికారులు కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. అలాగే, తమ కస్టడీలోకి తీసుకున్న సాయి డిఫెన్స్ అకాడెమి డైరెక్టర్ సుబ్బారావును దర్యాప్తు అధికారులు విచారిస్తున్నారు.