Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మద్య నిషేధం ప్రభుత్వం తీసుకోవాల్సిన విధాన నిర్ణయమనీ, దీనిపై తాము ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పిటీషనర్ కుమారుడు మద్యానికి బానిసయ్యాడని చెప్పి రాష్ట్రంలో మద్య నిషేధ ఉత్తర్వులు ఇవ్వాలంటే ఎలాగని ప్రశ్నించింది. తన కుమారుడు (పోలీస్ కానిస్టేబుల్) శ్రీధర్‌గౌడ్ మద్యానికి బానిసై తమను వేధిస్తున్నాడనీ, కాబట్టి మద్య నిషేధ ఉత్తర్వులు ఇవ్వాలంటూ జడ్చర్లకు చెందిన రామచంద్రయ్యగౌడ్,భారతమ్మ దంపతులు వేసిన పిల్‌ను కొట్టేస్తూ ప్రధాన న్యాయమూర్తి సతీశ్‌చంద్రశర్మ నేత ృత్వంలోని డివిజన్ బెంచ్ ఇటీవల తీర్పు చెప్పింది. తాగుడు వల్ల తన కుమారుడు కానిస్టేబుల్ ఉద్యోగం పోగొట్టు కున్నాడనీ, భార్య కూడా వదిలేసిందనీ, కొడుకు నుంచి తమకు రక్షణ కల్పించాలన్న పిటిషనర్ దంపతుల వాదనను తిరస్కరించింది.
సర్వే చేయకపోతే కోర్టుకు రండి
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం రామలింగంపల్లి గ్రామంలో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై సర్వే చేసి ఆక్రమణదారుల నుంచి భూమిని కాపాడాలని హైకోర్టు ఆదేశించింది. లేకపోతే జిల్లా కలెక్టర్ తదుపరి విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని కోరింది. రెండు సర్వే నెంబర్లల్లోని సుమారు ఏడు వందల ఎకరాలు ఆక్రమణకు గురైనా చర్యలు లేవంటూ కాంగ్రెస్ నేత బోరెడ్డి ఆయోధ్యరెడ్డి పిల్ వేశారు. ఆక్రమణలను తొలగించి భూమిని స్వాధీనం చేసుకునేలా అధికారులను ఆదేశించాలని గతంలో హైకోర్టు ఆదేశించినా గడువు కావాలని కలెక్టర్ కోరారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి సతీష్‌చంద్రశర్మ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆక్రమణలను తేల్చేందుకు సమగ్ర సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చింది. తమ ఆదేశాలు అమలు చేయకపోతే వచ్చే విచారణకు కలెక్టర్ హైకోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.