Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాల్గొన్న సందీప్ కుమార్ మఖ్తల, శాస్త్రవేత్త రఘునందన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మక్తల్ నియోజకవర్గం కృష్ణ మండలం ముడుమాల్ వద్ద ఉన్న ప్రపంచ ప్రఖ్యాత నిలువు రాళ్లకు యునెస్కో గుర్తింపు తీసుకు వచ్చే దిశగా చర్యలు చేపడుతున్నట్లు జై మక్తల్ ట్రస్ట్ అధ్యక్షుడు, టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మఖ్తల తెలిపారు. ఇందులో భాగంగా జూన్ 21 సమ్మర్ సాల్స్టిస్ సందర్భంగా నిలువురాళ్ళ వద్ద ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్‌తో కలిసి సూర్యుడి గమన దిశలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సందీప్ కుమార్ మఖ్తల మాట్లాడుతూ... ఆర్బిట్ 2022 లో భాగంగా నిలువురాళ్లకు యునెస్కో గుర్తింపు తీసుకువచ్చే దిశగా మార్చి 20, 21వ తేదీన ఈక్వినాక్స్ పరిశీలించగా తాజాగా రెండో అడుగులో భాగంగా.. జూన్ 21 సాల్ట్ సిస్ (లాంగెస్ట్ డే - పగలు ఎక్కువ ఉన్న రోజు) సందర్భంగా నిలువురాళ్ళ వద్ద సూర్యుని గమన దిశలు తదితరాంశాలను నమోదు చేసుకున్నామని జరిగిందని తెలిపారు. యునెస్కో గుర్తింపు కోసం కీలకమైన డాక్యుమెంటేషన్ కోసం ఈ వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు.