Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు కాల్ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని రైతుల సహాయార్థం త్వరలోనే టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని నాంపల్లి పబ్లిక్‌గార్డెన్‌లో ఆయన 'వ్యవసాయ శాఖ కాల్‌సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను రైతులకు వివరిం చేందుకు, రైతుల విజ్ఞప్తులు స్వీకరించేందుకు ఈ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రైతు బంధు, రైతు బీమా, ఇతర పథకాలకు సంబంధించి ఏ ఇతర వివరాల కోసమైనా కాల్ సెంటర్ ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. రాష్ట్రంలోని 63 లక్షలమంది రైతుల ఫోన్ నంబర్లు వ్యవసాయ శాఖ వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు.
వానాకాలంలో పత్తిసాగు లక్ష్యం 70 లక్షల ఎకరాలు
వానాకాలం సీజన్లో పత్తి పంట 70 లక్షల ఎకరాల్లో సాగవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. 15 లక్షల ఎకరాల్లో కంది విత్తనాలు వేస్తారని చెప్పారు. బుధవారం కాల్‌సెంటర్‌ను ప్రారంభించిన తర్వాత మంత్రి ఉన్నతాధికారులతో పత్తిసాగుపై సమీక్షించారు. విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతామన్నారు.