Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జులై నుంచి రిజిస్ట్రేషన్లు
- యూనివర్సల్ రియల్టర్స్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తాము చేపట్టిన ఐదు ప్రాజెక్టుల్లోని వాణిజ్య, నివాస, ఆతిథ్య ఆస్తుల జాయింట్ వెంచర్లకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఊరటనిచ్చాయని యూనివర్సల్ రియల్టర్స్ డైరెక్టర్ ఎం.పీ.అగర్వాల్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తాజా ఉత్తర్వులతో బొటానికా, ప్లాటినా, రాడిసన్ హౌటల్, మంజీరా, ట్రినిటి సహా ఇతర గృహ, వాణిజ్య ఆస్తి యజమానులకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ నిర్ణయంతో బొటానికాలో నివాసముంటున్న 300 కుటుంబాల సమస్య తీరినట్టేనని స్పష్టం చేశారు. సమస్య పరిష్కారానికి తాము రాష్ట్ర హౌజింగ్ బోర్డు వైస్‌చైర్మెన్, కమిషనర్‌తో చర్చించినట్టు వెల్లడించారు. జెఎల్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పట్నాయక్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు.