Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివద్ధి సంస్థ (రెడ్కో) నూతన చైర్మెన్‌గా నియమితులైన యెరువు సతీష్‌రెడ్డి బుధవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావును కలిశారు. తనను రెడ్కో చైర్మెన్‌గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి అప్పగించిన బాధ్యతలను త్రికరణ శుద్ధితో నిర్వర్తిస్తానని ఈ సందర్భంగా ఆయన మీడియాతో అన్నారు. అనంతరం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మెన్ వాసుదేవరెడ్డిలతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనకు కూడా కతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రెడ్కో చైర్మెన్ సతీశ్ రెడ్డిని సత్కరించారు.