Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టార్టప్‌లపై టీ-హబ్‌కు ద.మ.రైల్వే ఆహ్వానం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భారతీయ రైల్వే ప్రవేశపెట్టిన 'స్టార్ట్అప్ ఫర్ రైల్వేస్' విధానంలో భాగస్వాములు కావాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్చార్జి) అరుణ్ కుమార్ జైన్ టీ-హబ్ సీఈఓ ఎమ్ శ్రీనివాసరావును కోరారు. బుధ వారంనాడాయన టీ-హబ్ బందంతో సమావేశమయ్యారు. భారతీయ రైల్వేలోని కొన్ని క్లిష్టమైన అంశాల పరిష్కారానికి వర్థమాన సంస్థలను భాగస్వామ్యం చెయ్యాలనే ప్రాతిపదిక న భారతీయ రైల్వే ఈ విధానాన్ని ప్రవేశపెట్టిందని వివరించారు. టీ-'హబ్ ద్వారా అనేక నూతన ఆవిష్కరణలు జరుగుతున్న నేపథ్యం లో రైల్వే అంశాలను కూడా స్వీకరించి, కొత్త ఆవిష్కరణలు చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. మొదటి దశగా రైల్వే 11 క్లిష్టమైన రంగాలను గుర్తించి వాటి పరిష్కారా నికి స్టార్టప్ లను ఆహ్వానించినట్టు వివరించారు.