Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అంతర్జాతీయ విత్తనాభివృద్ది సంస్థ (ఐఎఫ్టీఏ) అధ్యక్షుడిగా రాష్ట్రానికి చెందిన డాక్టర్ కేశవులు నియమితులయ్యారు. ఈ సంస్థ స్విట్జర్లాండ్ కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిసు ్తంది. తెలంగాణా విత్తనాభివృద్ది సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న కేశవులు స్వగ్రామం సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రం. అంతర్జాతీయ స్థాయిలో అరుదైన అవకాశం పొందిన కేశవులు మర్యాద పూర్వకంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని కలిశారు. ఆసియా ఖండంలోనే మొట్టమొదటి సారిగా అంతర్జాతీయ స్థాయిలో ఐఎఫ్టీఏ చైర్మన్‌గా నియమితులైన సందర్భంగా మంత్రి ఆయన్ని సత్కరించారు.