Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
దేశం కోసం ప్రాణాలర్పించేందుకు సైతం సిద్ధమయ్యే జవాన్లకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్ పథకంతో సికింద్రాబాద్‌లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఓ ఆర్మీ అభ్యర్థి ఓ టీవీ ఛానల్లో మాట్లాడగా, తనపై కూడా పోలీసులు కేసు పెడతారనే భయంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జనగామ జిల్లా స్టేషన్ఘనపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన గోవింద్ రేణుక- లింగ స్వామిల చిన్న కుమారుడు గోవింద్ అజరు ఇటీవలి ఆర్మీ రిక్రూట్మెంట్లో ఎంపిక కావడంతో హైదరాబాద్ వెళ్ళాడు. కాగా తాను అనుకోకుండా ఓ టీవీ ఛానల్లో మాట్లాడగా అది కాస్త ప్రచారమైంది. దాంతో తీవ్ర భయాందోళనకు గురై మంగళవారం రాత్రి క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కాశిబుగ్గలోని ఓ ప్రయివేటు హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం అజయ్ పరిస్థితి బాగానే ఉందని తల్లిదండ్రులు తెలిపారు. ఉద్యోగం వస్తే బతుకు బాగుపడుతుందని అనుకుంటే అభం శుభం తెలియని యువకుడికి ఇలాంటి పరిస్థితి రావడం దారుణమని, ఊర్లో కూడా అందరితో కలిసి ఉండేవాడని, ఎలాంటి చెడు అలవాట్లు లేవని, అల్లర్లకు వెళ్ళేవాడు కాదని, నిరుపేద కుటుంబంలో పుట్టిన అజయ్‌ను చూసి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.