Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీసీ రోడ్లు..పంచాయతీ భవనాల నిర్మాణాలు మొదలుపెట్టండి:
- రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్త్రీ నిధి రుణాల ద్వారా ఇంటింటికీ సోలార్ ప్రాజెక్టు అందేలా చూడాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. పల్లె ప్రగతితోపాటు, ఆయా శాఖల్లో నిర్వహిస్తున్న పలు పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రయోగాత్మకంగా ప్రతి జిల్లాలో వెయ్యి మంది మహిళా లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. మహిళా గ్రూపులకు కుట్టు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. పల్లె ప్రగతి హామీలు వెంటనే చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో కొత్త సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు మొదలు పెట్టాలని ఆదేశించారు. డ్వాక్రా గ్రూపుల ఉత్పత్తులను ఫ్లిక్ కార్ట్ తో అమ్మకానికి ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు తెలిపారు. స్త్రీ నిధి వేతన పెంపు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హన్మంతరావు, డిప్యూటీ కమిషనర్లు, పంచాయతీరాజ్ ఈఎన్సీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.