Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కేంద్రంలో విషాదఛాయలు
- బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కంచర్ల
నవతెలంగాణ -నల్లగొండ
అమెరికాలో మేరీల్యాండ్ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా విద్యార్థి నక్క సాయిచరణ్(26)ను ఆదివారం రాత్రి నల్ల జాతికి చెందిన యువకులు కాల్చేశారు. నక్క సాయిచరణ్ కారులో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నల్లగొండ పట్టణంలోని వివేకానంద నగర్లో నివాస ముంటున్న చరణ్ తండ్రి నర్సింహ రిటైర్డ్ హెడ్మాస్టర్. సాయి చరణ్ ఏకైక కుమారుడు. అతని అక్క కూడా అమెరికాలో ఉండటంతో చరణ్ రెండున్నరేండ్ల కిందట ఎంఎస్ కోసం అమెరికా వెళ్లాడు. సాయి చరణ్ మరణవార్త విన్న కుటుంబీకులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే కంచర్ల
సాయి చరణ్ తల్లిదండ్రులను నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ సైదిరెడ్డి బుధవారం పరామర్శించారు. హత్య ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారిని ఓదార్చారు. మృతదేహాన్ని అమెరికా నుంచి త్వరగా తెప్పించేందుకు ప్రభుత్వంతో మాట్లాడుతానని ఎమ్మెల్యే చెప్పారు.