Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుటుంబీకులకు చెప్పకుండా గాంధీకి మృతదేహం తరలింపు
- ఈశ్వర్ లకిë ఆస్పత్రిలో ఘటన
- డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ భర్త, బంధువుల ధర్నా
- బీసీ, షుగర్ లెవల్స్ పడిపోవడంతోనేనన్న డాక్టర్లు
- న్యాయం జరిగేలా చూస్తామని పోలీసుల భరోసా
నవతెలంగాణ- అడిక్‌మెట్
ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ తర్వాత బీపీ, షుగర్ లెవల్స్ పెరిగి.. గుండెపోటుతో బాలింత మృతిచెందింది. అయితే, డాక్టర్ల నిర్లక్ష్యమే కారణ మంటూ కుటుంబీకులు ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. ఈ ఘటన హైదరాబాద్ అశోక్‌నగర్ పరిధిలోని ఈశ్వర్ లకిë ఆస్పత్రిలో జరిగింది. మృతురాలి భర్త రాము తెలిపిన వివరాల ప్రకారం.. మలక్‌పేటకు చెందిన పుష్పలత(38)తో రాముకు ఆరేండ్ల కిందట వివాహం జరిగింది. పుష్పలత డెలివరీ కోసం రెండ్రోజుల కిందట గాంధీనగర్ డివిజన్ అశోక్‌నగర్ పరిధిలోని ఈశ్వర్ లకిë ఆస్పత్రికి తీసుకొచ్చారు. బుధవారం ఉదయం 5:40 గంటలకు ఇంట్లో ఉన్న రాముకు ఆస్పత్రి నుంచి ఫోన్ వచ్చింది. డెలివరీ కోసం ఆస్పత్రిలో అడ్మిట్ అయిన పుష్పలత పరిస్థితి బాగాలేదని, వెంటనే ఇంజక్షన్ తేవాలని చెప్పారు. దాంతో రాము ఇంజక్షన్ తీసుకెళ్లి ఇచ్చాడు. ఆ తర్వాత డాక్టర్లు ఆపరేషన్ చేశారు. మరోసారి ఉదయం 8:30 గంటలకు ఆపరేషన్ పూర్తయిందని, బాబు పుట్టాడని చెప్పారు. అయితే, తల్లి పుష్పలత చనిపోయినట్టు చెప్పారు. అలా ఎలా జరిగిందని రాము ప్రశ్నించగా, బీపీ కంట్రోల్ తప్పి, గుండెపోటు వచ్చిందని డాక్టర్లు వివరించారు. దీంతో ఆస్పత్రి ఎదుట బంధువులతో కలిసి ధర్నా చేశారు. ఆపరేషన్ అయ్యాక చనిపోయిందని చెప్పడమేగాక తనకు సమాచారం ఇవ్వకుండా తన భార్య మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారని, డాక్టర్ల నిర్లక్ష్యం లేకుండా ఇలా ఎలా చేస్తారని రాము కన్నీటి పర్యంతమయ్యాడు. న్యాయం జరిగే వరకు కదిలేది లేదని ఆస్పత్రి ఎదుట బైటాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తగిన న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు భరోసా ఇవ్వడంతో బాధితులు ధర్నా విరమించారు.