Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీబీఐకి కె.ఎ.పాల్ ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీఎం కేసీఆర్ కుటుంబం రూ. తొమ్మిది లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందనీ, దానిపై విచారణ జరపాలని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కె.ఎ.పాల్ డిమాండ్ చేశారు. బుధవారం ఢిల్లీలో ఆయన సీబీఐ డైరెక్టర్ సుబోద్ కుమార్ జైశ్వాల్‌కు పిర్యాదు చేశారు. తాను ప్రపంచంలో మరెక్కడా ఇంతటి అవినీతిని చూడలేదని తెలిపారు. అవినీతి సొమ్ముతో తెలంగాణతో పాటూ సింగపూర్, దుబారు, అమెరికాలో అనేక ఆస్తులు కూడబెట్టారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా బడ్జెట్ రూ.లక్షా 5 వేల కోట్లు కాగా 35 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారనీ ఆరోపించారు. యాదాద్రికి రూ. 2 వేల కోట్ల అంచనా లో రూ. 200 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. సీబీఐకి చేసిన ఫిర్యాదు కాపీలను పాల్ కేంద్ర మంత్రులు అమిత్ షా, పురుషోత్తం రూపాలా కు పంపించారు.