Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 26న రాష్ట్ర జనరల్ కౌన్సిల్‌ను జయప్రదం చేయాలి : ఐఎఫ్టీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు జులై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయనీ, వీటిని కార్మికవర్గమంతా తిప్పికొట్టాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం పిలుపునిచ్చారు. ఈ నెల 26న హైదరాబాద్‌లో జరిగే ఐఎఫ్టీయూ జనరల్ కౌన్సిల్‌కు సంబంధించిన గోడపత్రికను బుధవారం హైదరాబాద్‌లోని మార్క్స్ భవన్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ఎల్ పద్మ, వి.ప్రవీణ్, ఆటో యూనియన్ నాయకులు వి.కిరణ్, తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.హన్మేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలనీ, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను అడ్డుకోవాలని కార్మికులకు పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలను నియంత్రించాలని ప్రభుత్వాలను కోరారు.