Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూతబడిన రైస్ మిల్లులను తెరిపించాలి
- హమాలీ కార్మికుల ఉపాధిని కాపాడాలి
- 25న ఎఫ్సీఐ ఎదుట ధర్నా :
- తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్
- రాష్ట్ర గౌరవాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ- నల్లగొండ
కస్టమ్ మిల్లింగ్రైస్ను ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయాలని, మూతబపడిన రైసుమిల్లులను వెంటనే తెరిపించి కార్మికుల ఉపాధిని కాపాడాలని తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 25న ఎఫ్సీఐ జిల్లా కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని దొడ్డికొమురయ్య భవనంలో నిర్వహించిన ఫెడరేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కస్టమ్ మిల్లింగ్ రైస్ సేకరణ ఈనెల 7వ తేదీ నుంచి నిలుపుదల చేయడం వల్ల రాష్ట్రంలో సుమారు 1500 రైసు మిల్లులు మూతపడ్డాయన్నారు. దీంతో రెండు లక్షల మంది హమాలీలు, మిల్లు డ్రైవర్, దినసరి కూలీలు, గుమస్తాలు, ట్రాన్స్పోర్ట్ లారీ డ్రైవర్స్, ఎస్ డబ్ల్యూ సీ, సిడబ్ల్యుసి, ఎఫ్సీఐ గోదాం హమాలీలకు పనిలేకుండా పోయిందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు పనులు లేక సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 200 రైసుమిల్లులు 20 రోజులుగా మూతపడ్డాయని అన్నారు. ఈనెల 25న ఎఫ్సీఐ జిల్లా కార్యాలయం ఎదుట మహాధర్నాను నిర్వహించనున్నట్టు తెలిపారు. తెలంగాణ ఆల్ హమాలీ జిల్లా అధ్యక్షులు తిరుపతి రామ్మూర్తి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, హమాలి ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, డబ్బీకార్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.