Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ, ఏపీలో త్వరలో నిర్వహించబోయే గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఆదివారం ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నట్టు 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమి ప్రకటించింది. ఈ మేరకు ఆ అకాడమి చైర్మెన్ బి కృష్ణప్రదీప్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆదివారం ఉదయం పది గంటలకు ఈ సదస్సును హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో ఉన్న తమ అకాడమిలో నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో సీనియర్ అధ్యాపకులతో గ్రూప్-1, గ్రూప్-2 సిలబస్, సన్నద్ధమయ్యేందుకు ప్రణాళిక, సమయపాలన, ఇంటర్వ్యూ వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పిస్తారని వివరించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ సదస్సుకు హాజరు కావాలని కోరారు. ఇతర వివరాలకు 040 35052121, 9133237733 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.