Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాత పద్ధతిలోనే ఇంటర్ పరీక్షలు : ప్రభుత్వం నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియెట్ విద్యార్థులకు 2022-23 విద్యాసంవత్సరంలో వందశాతం సిలబస్‌తో పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసు కుంది. కరోనా నేపథ్యంలో 2020-21, 2021-22 రెండు విద్యాసంవత్సరాల్లోనూ 70 శాతం సిలబస్‌తోనే ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇంకో వైపు విద్యార్థులకు ఎక్కువ వెసులుబాటు కల్పించేందుకు ఛాయిస్ పెంచి ప్రశ్నాపత్రాలు రూపొందించారు. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి వందశాతం సిలబస్‌ను విద్యార్థులకు బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్ బోర్డు ప్రతిపాదనలకు గురువారం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కరోనాకు ముందు ఉండే పాత పద్ధతిలోనే ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. అంటే వంద శాతం సిలబస్‌తో ప్రశ్నాపత్రాలను రూపొందిస్తారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇదే వర్తిస్తుంది. గత విద్యాసంవత్సరంలో ఫస్టియర్ విద్యార్థులు 70 శాతం సిలబస్ చదివారు. ఇప్పుడు వారు ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. పాఠ్యాంశాలకు సంబంధించిన ఏమైనా ఉంటే బ్రిడ్జీ కోర్సు లేదా ప్రత్యేక తరగతుల ద్వారా విద్యార్థులకు బోధిస్తారు.