Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేతనాలు పెంచేందుకు నిర్మాతల మండలి అంగీకారం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సినీ కార్మికులు సమ్మె విరమించారు. వేతనాల పెంపుపై నిర్మాతల మండలి నుంచి స్పష్టమైన హామీ రావడంతో నేటి ( శుక్రవారం) నుంచి సినిమా చిత్రీకరణలకు హాజరుకానున్నట్టు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు వెల్లడించారు. 45శాతం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సినీ కార్మికులు గత రెండు రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. కార్మికుల ఆందోళనలపై గుర్రుగా ఉన్న నిర్మాతల మండలి...సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోక్యంతో దిగొచ్చింది. ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులతో నిర్మాతల మండలి ముఖ్యులు గురువారం చర్చలు జరిపారు. సినీ కార్మికుల సమస్యలు, వేతనాల పెంపుపై నిర్మాత దిల్రాజు అధ్యక్షతన సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు మండలి ప్రకటించింది. శుక్రవారం సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించి వేతనాలపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. కార్మికుల సమస్యలను సమన్వయ కమిటీ ద్వారా పరిష్కరించుకుంటామని కార్మిక సంఘాలు,ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు తెలిపారు. శుక్రవారం నుంచి సినిమా చిత్రీకరణలు యథాతథంగా జరుగుతాయని వారు వెల్లడించారు.