Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అరుణ్‌కుమార్ జైన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దిన చర్యల్లో భాగంగా రోజూ యోగా సాధన అవసరమని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్చార్జి) అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. ఎనిమిదో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా భారత్ స్కౌట్స్, గైడ్స్ ఆధ్వర్యంలో దక్షిణ ప్రాంతీయ స్థాయి యోగా ఉత్సవాలను సికింద్రాబాద్‌లోని రైల్వే క్రీడా మైదానంలో గురువారం ముగింపు ఉత్సవాల్లో అరుణ్ కుమార్ జైన్‌తో దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ రాజీవ్ కిశోర్, న్యూఢల్లీిలోని భారత్ స్కౌట్స్, గైడ్స్ జాతీయ ప్రధాన కార్యాలయం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.కృష్ణ స్వామి, సీనియర్ రైల్వే అధికారులు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ యోగాతో మానసిక, శారీరక స్వచ్ఛత చేకూరుతుందని తెలిపారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం నినాదమైన ''మానవత్వం కోసం యోగా'' ఆవశ్యకతను సమాజానికి తెలియజేస్తూ అందరూ యోగా చేసేలా ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు.