Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్‌లో పెండ్లింట విషాదం
నవతెలంగాణ- ఘట్కేసర్/ఖిలావరంగల్
ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారిని భారీ వాహనాలు ఢకొీట్టడంతో ఆరుగురు మృతిచెందారు. ఈ ఘటనలు మేడ్చల్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో జరిగాయి. వరంగల్‌లో పెండ్లింట విషాదం. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేసన్ పరిధిలోని హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి ఔషాపూర్ బైపాస్ రోడ్డులోని పెట్రోల్ బంక్ సమీపంలో బీబీనగర్ నుంచి ఉప్పల్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢ కొట్టింది. దాంతో తలకు, కాళ్లు ఇతర చోట్ల తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారిలో.. జనగాం జిల్లా సింగరాజుపల్లికి చెందిన పాలడుగు నవీన్ (25), కొత్తపల్లి గ్రామానికి చెందిన దాసరి నవీన్ (23), కరీంనగర్ జిల్లా చింతాపూర్కు చెందిన వినీత(21) ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం రంగశాయిపేట సమీపంలోని నాయుడు పంపు వద్ద గురువారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని బైక్ ఢ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పైన ఉన్న ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల ప్రకారం.. వర్ధన్నపేట మండలం ఇల్లందకు చెందిన గడ్డల మధుకర్ (23) ఇంట్లో బుధవారం వివాహం జరిగింది. ఈ క్రమంలో గురువారం రిసెప్షన్ నిర్వహించనుండటంతో జనగామ జిల్లా జఫర్గడ్ మండలం తమ్మడపల్లి(ఐ) గ్రా మానికి చెందిన గణేష్‌తో కలిసి కూరగాయల కోసం వరంగల్ మార్కెట్‌కి వెళ్ళారు. మార్కెట్ నుంచి తిరిగి వస్తుండగా ఆర్టీఏ జంక్షన్ సమీపంలోని నాయు డు పంపు వద్ద ఆగి ఉన్న లారీని ఢ కొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెండ్లి మరుసటిరోజే ఆ ఇంట్లో వ్యక్తి మృతి చెందడంతో గ్రామస్తులు విషాదంలో మునిగారు.