Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త వారికి అవకాశం కల్పించాలి : మంత్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్పథకమనేది 'జూఠా' యోజన అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. పీఎం కిసాన్ కింద ఇప్పటి వరకు రైతులకు అందింది రూ.7689 కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు. ఈ స్కీమ్‌లో కొత్తవారు నమోదు చేసుకునేందుకు అవకాశం లేదని పేర్కొంటూ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫిబ్రవరి ఒకటి,2019 తర్వాత కొత్తగా ఒక్కరికి కూడా ఇచ్చింది లేదన్నారు. 2024 వరకు కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేదని విమర్శించారు. రైతుబంధు పథకం కింద రాష్ట్రంలో 66 లక్షల మంది రైతులు లబ్దిపొందుతున్నారని చెప్పారు. పీఎం కిసాన్ కింద ఏడాదికి రూ.6 వేలు వస్తున్నదనీ, 35.74 లక్షల మంది లబ్ది పొందుతున్నారని చెప్పారు. ఈ వానాకాలం సీజన్‌తో కలుపుకుంటే రైతుబంధు రూ.58 వేల కోట్ల నిధులు తెలంగాణ రైతుల ఖాతాల్లోకి వస్తాయని తెలిపారు. ఆదాయం పన్ను కట్టినా, రూ.పదివేల పెన్షన్ వచ్చినా, ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా, పదవీ విరమణ చేసినా, తమ తమ అసోసియేషన్లలో నమోదు చేసుకున్న డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆర్కిటెక్ట్‌లు, ఛార్టెడ్ అకౌంటెట్లు ప్రధాని కిసాన్ సమ్మాన్ యోజనకు అనర్హులు అని విమర్శించారు. రైతుబంధుపై రంకెలు వేసే బీజేపీ నేతలు ఈ విషయంలో ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని నిలదీశారు. తెలంగాణలో రైతుల్లో కొత్తవారికి కూడా ఈ పథకం వర్తించేలా ఎందుకు కృషి చేయలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ యోజన కింద రైతులకు ఇచ్చేది కేవలం రూ.2,200 కోట్లకు మించి లేదని చెప్పా రు. గతంలో వ్యవసాయ రంగ పథకాలన్నీ కలిపితే ఒక మండలంలో లబ్దిదారుల ను కేవలం 200 నుంచి 500 లోపు మాత్రమే ఉండేదని గుర్తు చేశారు. ఇప్పుడు రైతుబంధు ద్వారా భూమి ఉన్న ప్రతి రైతుకు నేరుగా సాయమందుతుందని తెలి పారు. అటవీ చట్టం ఆధీనంలో ఉన్న రైతుల భూములకు కూడా రైతుబంధు సా యమందించాలని పేర్కొన్నారు. కేంద్రం అడ్డగోలు నిబంధనల మూలంగా ప్రతి విడతలో 30 లక్షల మంది తెలంగాణ రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ప్రయోజనాలు అందడం లేదని గుర్తు చేశారు. రైతుల ఆదాయం రెట్టి ంపు చేస్తానన్న మోడీ...వారి పెట్టుబడి ఖర్చులను రెట్టింపు చేయ డంలో విజయవంతమయ్యాని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకంలో నిబంధనలు వెంటనే సడలించాలనీ, ప్రతి రైతుకూ ఈ పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు మందికి సుద్దులు చెప్పడం మానేసి ప్రధానమంత్రికి చెప్పి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.