Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేటీపీఎస్ కార్మికుడు మృతి
- టీఆర్‌వీకేఎస్‌లో చురుకైన పాత్ర
నవతెలంగాణ-పాల్వంచ
కేటీపీఎస్‌లో పనిచేస్తున్న క్రమంలో తలకు క్రేన్ తగిలి చికిత్స పొందుతూ ఓ కార్మికుడు మృతిచెందాడు. మృతుడు టీఆర్‌వీకేఎస్‌లో చురుకైన పాత్ర పోషించేవాడని పలువురు తెలిపారు. పోలీసులు, సింగరేణి అధికారులు, ఉద్యోగులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టమల్లి గ్రామానికి చెందిన కట్టా మల్లిఖార్జున్.. కొత్తగూడెం థర్మల్ పవర్‌స్టేషన్ (కేటీపీఎస్) 5, 6 దశలో బీఎం డివిజన్లో ఫస్ట్ గ్రేడ్ ఫోర్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం ఉదయం మిల్స్ ఏరియాలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఎస్కార్డు వాహనం మెటీరియల్ డంప్ చేస్తున్న క్రమంలో క్రేన్ తగలడంతో తీవ్ర గాయాలై కింద పడిపోయాడు. దాంతో కార్మికులు చికిత్స నిమిత్తం కేటీపీఎస్ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం కొత్తగూడెం సింగరేణి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 25 ఏండ్ల కిందట కేటీపీఎస్‌లో ఉద్యోగం చేస్తూ బీ కాలనీలోని క్వార్టర్లో నివసిస్తున్నారు. టీఆర్‌వీకేఎస్‌లో చురుకుగా ఉండేవాడని ఆ సంఘం నాయకులు కన్నీంటిపర్యంతమయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే కేటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ రవీంద్రకుమార్, ఎస్ఈ సంజీవయ్య, ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి మృతదేహాన్ని సందర్శించి, ప్రమాద వివరాలు తెలుసుకున్నారు.