Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ను ఈనెల 30లోగా ఇవ్వకుంటే పోరుబాట తప్పదని ప్రభుత్వాన్ని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) హెచ్చరించింది. వచ్చేనెల ఐదో తేదీన పాఠశాల విద్యాశాఖ సంచాలకుల (డీఎస్ఈ) కార్యాలయాన్ని ముట్టడించనున్నట్టు ప్రకటించింది. గురువారం హైదరాబాద్లో జాక్టో సమావేశం నిర్వహించారు. అనంతరం నాయకులు జి సదానందంగౌడ్, ఎం పర్వత్రెడ్డి, చంద్రశేఖర్, కె వెంకటి, గౌరీశంకర్, ఎంఎ అలీం, గంగరాజు, చైతన్య, విఠల్నాయక్, నయీం, జి రాములు, భుజంగరావు ఒక ప్రకటన విడుదల చేశారు. 317 జీవో బాధిత ఉపాధ్యాయులకు సత్వరమే న్యాయం చేయాలని కోరారు. 13 జిల్లాల స్పౌజ్లకు వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెండు, మూడు జీవోలపై ఉన స్టేను ఎత్తేసి గ్రేడ్-2 పండితులకు పదోన్నతులకు అవకాశం కల్పించాలని కోరారు. యాజమాన్యం వారీగా పదోన్నతులు కల్పించాలని తెలిపారు. మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో పనిచేస్తున్న సిబ్బందికి బదిలీలు చేపట్టాలని పేర్కొన్నారు.