Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 500 మంది బీడీ కార్మికులు
నవతెలంగాణ-కామారెడ్డిటౌన్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో మార్కండేయ యూనియన్ నుంచి 500 మంది బీడీ కార్మికులు బాన్సువాడ పట్టణంలో గురువారం తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు నాగారపు ఎల్లయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ రమ సమక్షంలో సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 500 మంది బీడీ కార్మికులు సీఐటీయూలో చేరారు. సీఐటీయూ బీడీ కార్మికుల సమస్యలపై చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులై వారు చేరినట్టు తెలిపారు. వారి సమస్యలపైన మరిన్ని పోరాటాలు చేసి వారికి వేతన ఒప్పందం పూర్తి అమలు కోసం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీడీ కార్మికులకు రావాల్సిన అన్ని హక్కుల కోసం సీఐటీయూ పని చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్, జె.రవీందర్, సురేష్ గొండ, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.