Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు అడ్వకేట్, మరో ఇద్దరి అరెస్ట్
నవతెలంగాణ- బోడుప్పల్
మూడేండ్ల కిందట కనిపించకుండా పోయిన నర్సింగ్ విద్యార్థినిని బలవంతంగా మావోయిస్టుల్లో చేర్పించారనే ఆరోపణల నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు గురువారం జిల్లాల్లో సోదాలు చేశారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని మూడు చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హేమ నగర్లో నివాసం ఉంటున్న హైకోర్టు అడ్వకేట్ శిల్ప, పర్వతాపూర్‌లో నివాసం ఉంటున్న చైతన్య మహిళా సంఘం నాయకురాలు దేవేంద్ర, అంబేద్కర్ ఫూలే యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి కిరణ్ః నివాసాల్లో సోదాలు నిర్వహించారు. అనంతరం ముగ్గురినీ అరెస్టు చేసి దర్యాప్తు సంస్థ కార్యాలయానికి తరలించినట్టుగా సమాచారం. అలాగే, మెదక్ జిల్లాలో కూడా సోదాలు చేశారు.