Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇన్ ఫ్లో 227 క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో 227 క్యూసెక్కులు
నవతెలంగాణ - ధరూర్
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వరప్రదాయిని అయిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్వల్పంగా కొనసాగుతోంది. ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల నుంచి 227 క్యూసెక్కుల నీరు జూరాలకు వచ్చి చేరుతోంది. జలాశయ నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.164 టీఎంసీల నీరుంది. ప్రాజెక్టు నుంచి యథవిధిగా నెట్టెంపాడుకు 0 క్యూసెక్కులు, భీమా లిఫ్టు-1కు 0 క్యూ సెక్కులు, భీమా లిఫ్టు-0 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 45 క్యూసెక్కులు, కుడి కాల్వకు 20 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 50 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మొత్తంమీద జూరాల నుంచి దిగువకు 227 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు.