Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలువురు అరెస్టు
- నేడు నిరసనలకు పిలుపునిచ్చిన ఎస్ఎఫ్ఐ
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ చిక్కడపల్లిలోని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కార్యాలయంపై ఎన్ఎస్యూఐ కార్యకర్తలు దాడిచేశారు. కేరళలోని వాయనాడ్‌లో రాహుల్ కార్యాలయంపై దాడి చేశారన్న ఇక్కడ తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. శుక్రవారం రాత్రి 8:45గంటల సమయంలో ఆకస్మికంగా కొందరు దాడులకు దిగడంతో అప్రమత్తమైన ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు దాడికి పాల్పడిన పలువురిని అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, నాగరాజు మాట్లాడుతూ.. ఎస్ఎఫ్ఐ కార్యాలయాలపై ఎన్ఎస్యూఐ కార్యకర్తలు దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేరళలో జరిగిన ఘటనపై స్వయంగా అక్కడి ముఖ్యమంత్రి పినరయి విజయన్ చర్యలు తీసుకొని దాడి చేసిన కార్యకర్తలను సస్పెండ్ చేశారని తెలిపారు. అయినా, ఎన్ఎస్యూఐ కార్యకర్తలు ఢిల్లీ, హైదరాబాద్‌లోని ఎస్ఎఫ్ఐ కార్యాలయాలపై దాడులు చేయడం సరైన పద్ధతి కదన్నారు. ఎస్ఎఫ్ఐపై దాడి చేయడం అంటే తెలంగాణ విద్యార్థిలోకంపై దాడులు చేయడమేనని స్పష్టంచేశారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, ఈ దాడులకు నిరసనగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చినట్టు తెలిపారు.