Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఢిల్లీ వసంత్ విహార్‌లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ నిర్మాణ పనులు వేగవంతం అయినట్టు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే లోయర్ గ్రౌండ్ తవ్వకం పనులు పూర్తయ్యాయనీ, శుక్రవారం ప్రత్యేక పూజలు చేసి, పుటింగ్ పనులకోసం ముగ్గు పోశామన్నారు. అలాగే పనుల పురోగతిపై నిర్మాణ సంస్థతో సమీక్షా సమావేశం నిర్వహించారు.