Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వార్తల్లో ఉండేందుకే వర్మ ట్వీట్లు : రాజాసింగ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎన్డీఏ బలపరుస్తున్న రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలను బీజేపీఎల్పీ నేత రాజాసింగ్ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వర్మ వేస్ట్ఫెలో అని విమర్శించారు. నిత్యం వార్తల్లో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తుంటాడనీ, తాగి ట్వీట్లు చేస్తాడని అన్నారు. ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా ఎన్నిక కానున్న సమయంలో వర్మ ట్వీట్ చాలా బాధాకరమన్నారు. వర్మపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 'రాష్ట్రపతి ద్రౌపది అయితే...కౌరవులు ఎవరు? పాండవులు ఎవరు?' అంటూ రాంగోపాల్ వర్మ వివాదాస్పద ట్వీట్ చేసిన విషయం విదితమే.