Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తన విదేశీ పర్యటనకు అనుమతించేలా సీబీఐకి ఉత్తర్వులు ఇవ్వాలని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి సీబీఐ కౌంటర్ వేయాలని హైకోర్టు ఆదేశించింది. జూన్ 30 నుంచి 15 రోజులపాటు యూరప్, అమెరికా వెళ్లే క్రమంలో తనకు సీబీఐ గతంలో ఇచ్చిన లుక్ ఔట్ నోటీసు అడ్డంకిగా ఉందంటూ చౌదరి వేసిన రిట్‌ను హైకోర్టు శుక్రవారం విచారించింది. రుణాల ఎగవేతపై సీబీఐ నమోదు చేసిన కేసులో హైకోర్టు ఆదేశాల తర్వాత పిటిషనర్ దుబారు వెళ్ళివచ్చారనీ, ఇప్పుడు అమెరికా వెళ్లేందుకు కూడా అనుమతివ్వాలన్న రిట్‌పై విచారణను జూన్ 27కి వాయిదా వేసింది. 2019లో ఒక్కసారి మాత్రమే సీబీఐ విచారించిందనీ, తర్వాత నోటీసు కూడా ఇవ్వలేదని పిటిషనర్ తరపు లాయర్ వాదించారు.
కోర్టు ధిక్కరణ నోటీసు
ముత్రాసిని, తెనుగు, ముదిరాజు కులాలను మత్స్య తెగలో చేర్చుతూ మత్స్య శాఖ 2019లో ఇచ్చిన జివో 96ను అమలు చేయాలన్న హైకోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయలేదంటూ దాఖలైన కోర్టు ధిక్కార కేసుపై హైకోర్టు స్పందించింది. మత్స్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అదర్సిన్హాకు కోర్టు ధిక్కార నోటీసునిచ్చింది. మూడు నెలల్లోగా జీవోను అమలు చేయాలంటూ 2022 మార్చిలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేయలేదంటూ ముదిరాజ్ మహాసభ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రావుల జగదీశ్వర్ ప్రసాద్ వేసిన కోర్టు ధిక్కార కేసును జస్టిస్ షమీమ్ అక్తర్ శుక్రవారం విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది దీనిపై డిఎల్ పాండు వాదించారు. అనంతరం కోర్టు విచారణను జులైకి వాయిదా వేసింది.