Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
స్నాకింగ్‌ను వల్ల తరచుగా అనారోగ్యకరమైన రీతిలో బరువు పెరుగుతారంటూ పలువురు భావిస్తుంటారనీ, పలు ఆరోగ్య సమస్యలకు అది హేతువుగానూ భావిస్తారనీ, అయితే అవసరమైన మినరల్స్, పోషకాలు శరీరానికి అందించడానికి ఇది ఓ సమర్థవంతమైన మార్గమని నిపుణులు పేర్కొన్నారు. కుటుంబ ఆరోగ్యం మెరుగ్గా నిర్వహించడం కోసం ఆరోగ్యవంతమైన స్నాకింగ్ ఆవశ్యకతను తెలుపుతూ ఆండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్కన్ హౌటల్లో ఓ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. స్మార్ట్ స్నాకింగ్ ఛాయిసెస్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్‌ను ఫ్యామిలీ హెల్త్ శీర్షికన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుప్రసిద్ధ బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ న్యూట్రిషన్-వెలెనెస్ కన్సల్టెంట్ సీలా కృష్ణస్వామి, మ్యాక్స్ హెల్త్ కేర్ ఢిల్లీ, రీజనల్ హెడ్ డైనిటిక్స్ రీతికా సమర్దార్ పాల్గొన్నారు. ఈ చర్చకు మోడరేటర్‌గా ఆర్టి షెజ్డ్ వ్యవహరించారని నిర్వాహకులు పేర్కొన్నారు.