Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలిక ఆత్మహత్య
నవతెలంగాణ - ఇబ్రహీంపట్నం
ప్రేమ పేరుతో వేధింపులు భరించలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో శుక్రవారం జరిగింది. ఎస్ఐ ఉమాసాగర్ కథనం ప్రకారం.. యామపూర్ గ్రామానికి చెందిన శైలజ(17)ను అదే మండలంలోని వేములకుర్తి గ్రామానికి చెందిన అక్కపెల్లి శ్రీకాంత్(21) కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో బాధితురాలు శుక్రవారం తన ఇంట్లో ఉరేసుకుంది. మృతురాలి తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మెట్పల్లి డీఎస్పీ రవీందర్రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట మెట్పల్లి సీఐ శ్రీనివాస్, ఎస్ఐ ఉమాసాగర్ ఉన్నారు.