Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1.22 కోట్ల బుక్స్ ముద్రణ
- డీఈవోలు ఎంపిక చేసిన దుకాణాల్లో కొనాలి
- ప్రభుత్వ ముద్రణాలయ సంస్థ సంచాలకులు శ్రీనివాసాచారి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం పాఠ్యపుస్తకాల అమ్మకాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ప్రస్తుత విద్యాసంవత్సరంలో 1.22 కోట్ల పుస్తకాలను ముద్రించామని ప్రభుత్వ ముద్రణాలయ సంస్థ సంచాలకులు ఎస్ శ్రీనివాసాచారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఎంపిక చేసిన 13 ప్రయివేటు ప్రింటర్లు, పబ్లిషర్లు తరగతుల వారీగా పుస్తకాలను ముద్రించాయని వివరించారు. డీఈవోలు ఎంపిక చేసిన దుకాణాల్లో పాఠ్యపుస్తకాలు సోమవారం నుంచి కొనేందుకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఆ దుకాణాదారులు పాఠ్యపుస్తకాలను ప్రయివేటు ప్రింటర్లు, పబ్లిషర్ల వద్ద కొనాలని కోరారు. ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్పీకే పుస్తకాలను అమ్మాలని దుకాణాదారులను ఆదేశించారు. ఎక్కువ ధరకు విక్రయించినా, స్టేషనరీ సామాగ్రి, నోటు పుస్తకాలు, గైడ్లు, వర్క్‌బుక్స్, పెన్నులు, పెన్సిల్లు వంటివి అదనంగా కొనాలని ఒత్తిడి చేస్తే సంబంధిత జిల్లా డీఈవోకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రతి సబ్జెక్టు, ప్రతి పాఠానికీ పాఠ్యపుస్తకాల్లో క్యూఆర్ కోడ్ ఉందని వివరించారు. విద్యార్థులు దాన్ని స్కానింగ్ చేసి పాఠాలను వినడం, చూడడం వంటివి చేయొచ్చని సూచించారు. కొత్త పాఠ్యపుస్తకాలను అందరూ కొనాలని కోరారు.
పాఠ్యపుస్తకాలు ముద్రించిన ప్రింటర్లు, పబ్లిషర్లు
ప్రింటర్/పబ్లిషర్ ముద్రించిన తరగతి
1. నవతెలంగాణ ప్రింటర్స్
ప్రైవేట్ లిమిటెడ్ 2, 9, 10
2. ఆర్క్బర్డ్ పబ్లికేషన్స్ 1, 6, 7, 8
3. సియా 3, 4, 5