Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కారు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఈ నెల 17న జరిగిన కాల్పుల్లో మరణించిన దామెర రాకేశ్ కుటుంబాన్ని ఆదుకునేందుకు గానూ అతని సోదరుడు రామ్రాజుకు రాష్ట్ర సర్కారు ఉద్యోగం కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రామ్‌రాజు విద్యార్హతకు అనుగుణంగా వరంగల్ జిల్లాలో తగిన ఉద్యోగం ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. రాకేశ్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే.