Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కరోనా బారిన పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన ఆయన హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి చైర్మెన్‌గా ఉన్నారు. ఈ నెల 22న ఆ ఆస్పత్రి 22వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఇతర ప్రముఖులతో పాటు బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కరోనా నిర్దారణ కాగానే బాలక ృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. రెండు మూడు రోజులుగా తనను కలిసి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తెరిగి తగిన పరీక్షలు చేయించుకోవడంతో పాటూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.