Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
జులై 20న రవీంద్రభారతి ప్రధాన వేదికపై తెలుగు విశ్వవిద్యాలయం 15వ స్నాతకోత్సవం నిర్వహించనున్నట్టు రిజిస్ట్రార్ భట్టు రమేష్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయం అధ్యక్షులు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అధ్యక్షత వహిస్తారని తెలిపారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ జస్టిస్ చంద్రయ్య స్నాతకోత్సవ ప్రసంగం చేయగా.. విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య టి.కిషన్ రావు నివేదిక సమర్పిస్తారని పేర్కొన్నారు. వివిధ విభాగాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టాలను బహుకరిస్తామని పేర్కొన్నారు.