Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వికలాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదని రాష్ట్ర ఎస్సీ కులాల అభివృద్ధి, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. శుక్రవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్లో కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన ఐదో వికలాంగుల జాతీయ సలహా మండలి సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ''దివ్యాంగుల భద్రత, సంక్షేమం, ఉన్నతికి తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ పేరుతో ప్రత్యేక విభాగం ఉందనీ, ఈ విభాగం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1983లో ఏర్పాటైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత 2014 జూన్ రెండో తేదీ నుంచి పనిచేస్తున్నదని తెలిపారు.వికలాంగుల సామాజిక, ఆర్థిక,విద్యా స్థితిగతులను మార్చేందుకు,ఉన్నతికి పని చేస్తున్నదని వివరించారు. ఈ విభాగానికి గతంలో డైరెక్టర్ ఉండగా,హోదాను పెంచి కమిషనర్గా వ్యవహరిస్తున్నామని,ఈ సంస్ధ పనితీరును మరింత మెరుగుపర్చేందుకు,పర్యవేక్షణకు రాష్ట్ర సలహా మండలిని కూడా ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా వికలాంగులు స్థానికంగా ఎదుర్కొనే తక్షణ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీలు కూడా పని చేస్తున్నాయని చెప్పారు.