Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎఫ్సీఆర్ఐ డీన్ ప్రియాంక వర్గీస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
యువతీయువకులు ఉద్యోగార్ధులుగా కాకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా మారాలనీ, ఎంటర్ ప్రెన్యూర్షిప్ వైపు ప్రయత్నించాలని ఎఫ్సీఆర్ఐ డీన్ ప్రియాంక వర్గీస్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎఫ్సీఆర్ఐ), ములుగు సెంచూరియన్ విశ్వవిద్యాలయం సహకారంతో ''ది ఫ్యూచర్ నెక్సస్-అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్రీ 4.0''పై శనివారం ఎఫ్సీఆర్ఐలో రోడ్‌షో నిర్వహించారు. సమీపంలోని గ్రామాలు, పట్టణాల్లో డొమైన్ కోర్సులపై, హైడ్రోఫోనిక్స్, బయో-ఫర్టిలైజర్, ఆర్గానిక్ ఫార్మింగ్, రిమోట్ సెన్సింగ్ వంటి శిక్షణ, ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లను పరిచయం చేయడానికి స్కూలు, కాలేజీ విద్యార్థులు ఈ రోడ్‌షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ బీపీ ఆచార్య కూడా పాల్గొన్నారు. హార్టికల్చర్ కళాశాలకు చెందిన 500 మంది విద్యార్థులు, రాజేంద్ర నగర్, గజ్వేల్, సిద్దిపేట టీఎమ్‌ఆర్‌ఈఐఎస్, ఎఫ్సీఆర్ఐ విద్యార్థులు రోడ్‌షో విజయవంతం చేశారు.