Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హర్షం వ్యక్తంచేసిన కాంట్రాక్టర్లు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలో స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ (ఎస్ఎస్ఆర్)ను పెంచుతున్నట్టు ఆ సంస్థ సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డి తెలిపారు. కాంట్రాక్టర్లు గడచిన ఐదేండ్లుగా ఒకే ధరకు పనులు చేస్తున్నారనీ, బహిరంగ మార్కెట్లో అన్ని వస్తువుల ధరలు పెరిగిన కారణంగా, పలు పనులకు రేట్లు గిట్టుబాటు కాక కాంట్రాక్టర్లు టెండర్లు కూడా వేయట్లేదని చెప్పారు. దీనివల్ల డిస్కం పరిధిలో అభివృద్ధి పనులు మందకొడిగా సాగుతున్నాయని వివరించారు. పట్టణ ప్రాంతాల్లో ఇప్పుడున్న ధరలపై 30 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 25 శాతం మేర ఎస్ఎస్ఆర్ రేట్లు పెంచామన్నారు. దీనిపై కాంట్రాక్టర్ల అసోసియేషన్లతో పలు దఫాలు చర్చలు జరిపి రేట్లు ఖరారు చేసినట్టు తెలిపారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శివకుమార్, యస్కే మాజిద్ ప్రకటించారు. ఈ సందర్భంగా శనివారం విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని కలిసి, ఘనంగా సన్మానించి, కృతజ్ఞతలు తెలిపారు.