Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్మీ రిక్రూట్మెంట్లో అనుమతివ్వాలి : బోయినపల్లి వినోద్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్/వరంగల్
అగ్నిపథ్ ఆందోళనకారులను బేషరతుగా విడుదల చేయాలనీ, వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని త్రివిధ దళాల సుప్రీం కమాండర్, రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌కు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. భవిష్యత్‌లో ఆర్మీ రిక్రూట్మెంట్లో పాల్గొనేలా అనుమతివ్వాలని కోరారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఇటీవల పోలీసుల కాల్పుల్లో మరణించిన రాకేష్ కుటుంబ సభ్యులను శనివారం వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం డబీర్‌పేటలో స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌లతో కలిసి వినోద్ కుమార్ పరామర్శించారు. రాకేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రపతిగా తనకున్న విశేష అధికారాల నేపథ్యంలో ఆ అభ్యర్థుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని వినోద్ కుమార్ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు.