Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎనిమిదేండ్ల నుంచి ఇచ్చిన నిధుల లెక్కలతో వస్తాం : తరుణ్‌చుగ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'ఎనిమిదేండ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చిందో లెక్కలతో సహా వస్తాం. కేసీఆర్‌కు దమ్ముంటే ప్లేస్, డేట్ చెప్పమనండి. మేము చర్చలకు సిద్ధం' అని బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్‌చుగ్ సవాల్ విసిరారు. పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం వ్యాట్ తగ్గించినా రాష్ట్రం ఎందుకు ఆ పని చేయట్లేదని ప్రశ్నించారు. కేసీఆర్, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలంతా అలిబాబా 40 దొంగల తీరుగా మారి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. 'సాలు దొర.. సెలవు దొర' వెబ్ సైట్ ను ప్రారంభిస్తామని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జులై రెండో తేదీన ప్రధాని మోడీ, క్యాబినెట్ మంత్రు లు, సీఎంలు, డిప్యూటీ సీఎంలు, అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు వస్తారని తెలిపారు. మూడో తేదీన పరేడ్ గ్రౌండ్లో భార బహిరంగ సభ ఉంటుం దన్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాలు, సభ కోసం ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపా రు. ప్రతి బూత్ స్థాయి లీడర్ రూ.1000 విరాళం అందిస్తున్నారని చెప్పారు.