Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐడీఐ నేషనల్ కౌన్సిల్ చైర్మన్ రాజశేఖర్ ఎర్రతోట
హైదరాబాద్ : వ్యాపార పరంగా అభివృద్ధి చేయటంలో దళితులను, ఆదివాసీలను బ్యాంకులు విస్మరిస్తున్నాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ దళిత ఇండిస్టీ(సీఐడీఐ) నేషనల్ కౌన్సిల్ చైర్మన్ రాజశేఖర్ ఎర్రతోట ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం దోమలగూడలోని సీఐడీఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాల్లో దళిత, ఆదివాసీలకు కేవలం రూ.28 కోట్లు మాత్రమే వెచ్చించడం దుర్మార్గమన్నారు. అంబానీ, ఆదానీ లాంటి సంపన్న వర్గాలకే బ్యాంకులు సహకరిస్తున్నాయన్నారు. సరళీకరణ తర్వాత ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరించడంతో రిజర్వేషన్ల ఔన్నత్యం కోల్పోయిందన్నారు. దళిత, ఆదివాసీ పారిశ్రామికవేత్తల అభివృద్ధికి బ్యాంకుల పాత్ర ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో చీఫ్ మెంటర్ రాజ్ కుమార్ నర్రా, తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడు శ్రీరాజు నీరుడి, ప్రధాన కార్యదర్శి ఎసరివుల శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.