Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యారంగ సమస్యలపై మహాసభలో చర్చ
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ల నాగరాజు
నవతెలంగాణ-కరీంనగర్
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభ జయప్రదానికి శనివారం కరీంనగర్ పట్టణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో ఆహ్వాన సంఘం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు మాట్లాడుతూ.. రాష్ట్ర మహాసభను సెప్టెంబర్ 14, 15, 16 తేదీల్లో కరీంనగర్లో నిర్వహించనున్నట్టు చెప్పారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభను కరీంనగర్లో నిర్వహించడం అభినందనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై, యూనివర్సిటీల్లో విద్యార్థులపై దాడులు, విద్యా కాషాయీకరణ, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అగ్నిపథ్ స్కీమ్‌తో ఆర్మీలో కాంట్రాక్టు పద్ధతిని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలపై, హక్కుల కోసం రాష్ట్ర మహాసభలో చర్చిస్తామని చెప్పారు. 120మందితో ఆహ్వాన సంఘం ఏర్పాటు చేశామని, గౌరవ అధ్యక్షుడుగా ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, అధ్యక్షులుగా అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మెన్ వి.నరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రజినీకాంత్, కోశాధికారిగా గజ్జల శ్రీకాంత్ కొనసాగనున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీజేసీ విద్యాసంస్థల చైర్మెన్ మైపాల్‌రెడ్డి, నాయకులు మిల్కురి వాసుదేవరెడ్డి, గుడికందుల సత్యం, జి.బీమా సాహెబ్, ఎడ్ల రమేష్, రమేష్, తిరుపతి, రాజు, శ్రీనివాస్, నర్సింహారెడ్డి, రామరాజు, అశోక్, పూజ, ప్రశాంత్, సునీత, సాగర్, వినిషా, అభిలాష్, అరవింద్, మనోజ్, రమ్య పాల్గొన్నారు.