Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ రహదారుల అందాలను బంధిస్తే బహుమతులు:ఎన్హెచ్ఏఐ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలోని జాతీయ రహదారుల అందాలను క్లిక్కుమనిస్తే బహుమతులు ఇవ్వనున్నట్టు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ ఆదివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆజాదీకి అమతోత్సవాల్లో భాగంగా డిజిటల్ ఫోటోగ్రఫీ కాంటెస్ట్-2022 నిర్వహిస్తున్నట్టు తెలియజేసింది. తెలంగాణలోని జాతీయ రహదారులను అందాలను ఫోటోలు తీసి, ఎన్ హెచ్ఏఐ అధికారిక వెబ్సైట్లో ఉన్న యూఆర్ఎల్ లింకు ద్వారా వాటిని అప్లోడ్ చేయాలని సూచించింది. ఉత్తమ ఫోటోలు తీసిన ఫోటోగ్రాఫర్లకి బహుమతులు ఇస్తామని వివరించింది.