Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సచివాలయ నిర్మాణ పనులను
- పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీఎం కేసీఆర్ విధించిన గడువులోగా సచివాలయ నిర్మాణ పనులను పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బ్లాకుల వారీగా పనుల్లో వేగం పెంచాలనీ, పనులన్ని సమాంతరంగా, నాణ్యతతో జరగాలని సూచించారు. గ్రాండ్ వెల్కమ్ ఎలివేషన్ పనుల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల న్నారు. రెడ్ సాండ్ స్టోన్ అమరిక పనుల్లో వేగం పెంచాలని వర్క్స్ ఏజెన్సీని, అధికారులను ఆదేశించారు. మూడు షిఫ్టుల్లో పనులు జరగాలనీ, అందుకు తగ్గట్టుగా వర్కర్లను నియమించుకోవాలని ఆదేశించారు. మంత్రి వెంట ఆర్ అండ్ బి అధికారులు, ఈఎన్సీ గణపతి రెడ్డి తదితరులున్నారు.