Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీడీఎంఎస్ డాక్టర్ ఇనుముల సత్యనారాయణకు
- ఎంఈఏఐ ప్రతిష్టాత్మక పురస్కారాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రానికి చెందిన ప్రముఖ మైనింగ్ ఇంజినీర్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీగా ఒడిశాలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఇనుముల సత్యనారాయణను ప్రతిష్టాత్మక పురస్కారాలు వరించాయి. మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఈఏఐ) ప్రతి ఏటా ప్రదానం చేసే ఎస్ఆర్జీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవార్డు -2021ని, మైనింగ్ రంగంలో వస్తున్న నూతన సాంకేతికతలపై ఆయన రాసిన వ్యాసానికి డాక్టర్ ఎం.ఎల్.జాన్వర్ పురస్కారం ఆయనకు లభించాయి. శనివారం సాయంత్రం బెంగళూరులో జరిగిన ఎంఈఏఐ జాతీయ వార్షిక సర్వ సభ్య సమావేశంలో డాక్టర్ ఇనుముల సత్యనారాయణకు ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. మైనింగ్ రంగంలో ఆయన అందిస్తున్న విశేష సేవలను గుర్తించి ఈ పురస్కారాలకు ఎంపిక చేసినట్లు ఎంఈఏఐ జాతీయ అధ్యక్షులు కె.మధుసూదన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఏఐ ప్రధాన కార్యదర్శి నర్సయ్య, ఎంఈఏఐ హైదరాబాద్ చాప్టర్ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎం.ఎస్.వెంకట్రామయ్య, కార్యదర్శి బి.మహేశ్, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ఎంఈఏఐ శాఖల ప్రతినిధులు, మైనింగ్ ఇంజినీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.