Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మెన్‌గా టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కుర్మాచలం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌లో గల ఎఫ్ డీసీ కార్యాలయంలో జరిగిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, సినీ దర్శకులు ఎన్.శంకర్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అనిల్ కుర్మాచలంకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ, సినిమా రంగ అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, చిన్న సినిమాలకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని తెలిపారు. అనిల్ కుర్మాచలం రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని, పర్యాటకాన్ని, సాంస్కృతిక రంగాలను ప్రపంచానికి పరిచయం చేశారని వక్తలు కొనియాడారు.